టిటిడి గోశాలలో గోవులకు పెట్టే గడ్డిని కూడా గత పాలకులు వదలలేదని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడారు. టిటిడి గోశాలలో ఆల్ ఇండియా గోసంరక్షణ సంస్థ ప్రధాన కార్యదర్శి, టిటిడి గోసంరక్షణ పూర్వ సభ్యులు శ్రీ కోటి శ్రీధర్ , టిటిడి బోర్డు సభ్యులు, మీడియాతో కలిసి ఛైర్మన్ శనివారం పరిశీలించారు. ప్రస్తుతం గోవులకు అందుతున్న దాణా, త్రాగునీరు, పరిశుభ్రత, అవసరమైన వైద్యం జరుగుతుందా తదితర అంశాలను గోశాల ఇంఛార్జి డైరెక్టర్ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. గోశాలలో గోవులు, పేయ దూడలు ఉంటున్న షెడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
టిటిడి గోశాలపై కోర్టుల్లో పిల్స్ దాఖలు చేస్తామని కొంత మంది ఫోన్ లు చేస్తున్నారని, వారిని ఒకటే కోరుతున్నా, గత ఐదేళ్ల పాలనలో టిటిడిలో జరిగిన నిధుల స్వాహా, అవకతవకల అంశాలను జోడించి కోర్టుల్లో కేసులు దాఖలు చేస్తే వారికి పూర్తి సహకారం అందిస్తామని ఛైర్మన్ చెప్పారు . గతంలో పింక్ డైమండ్ మీద కోర్టులో కేసు వేశారని, ఆ కేసు ఏమైందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక టిటిడిలో ఎలాంటి అవినీతి జరుగలేదని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
టిటిడిలో గత 10 నెలల్లో ఏమి జరుగకపోయినా ఏదో జరిగిపోతున్నట్లు కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న గ్లోబల్ ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సరికాదని సూచించారు. 2023-24 ఏడాదిలో అప్పట్లో టిటిడి గోసంరక్షణ సలహాదారు శ్రీ కోటి శ్రీధర్ చెప్పిన మాటలను చూస్తుంటే , టిటిడి గోశాలలో జరిగిన అవకతవకలపై మాకు తెలిసింది కొంతే, ఇంకా చాలా ఉందని చెప్పారు. టిటిడి గోశాల గోవులను కూడా ఒంగోలులో అమ్ముకున్నట్లు తెలుస్తోందన్నారు.
గతంలో టిటిడి గోశాల సంచాలకులుగా పనిచేసిన డా. హరినాథ్ రెడ్డి టిటిడి గోశాలను సొంత ఎస్టేట్ లాగా భావించి భారీ అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఎవరిని గోశాలలోకి రానివ్వకుండా హరినాథ్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరించారన్నారు. వైద్యులను, ఇతరులను గోశాలకు రానివ్వకుండా వేధించారణే ఆరోపణలు ఉన్నాయన్నారు.
టిటిడిలో జరిగిన పలు అవకతవకలపై అవసరమైతే ఏసీబీ విచారణ కోరుతామని ఛైర్మన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, టిటిడి గోశాలలో గోవుల సహజ మరణాలపై అసత్య ప్రచారం చేసి, టిటిడి ప్రతిష్టతను పలుచన చేస్తున్న టిటిడి పూర్వ ఛైర్మన్ శ్రీ బి కరుణాకర్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. చట్టాలనుండి తప్పించుకోలేరని మాట్లాడారు.
టిటిడి గోశాలలో గత పాలకుల పాలనలో ఉన్న పూర్వ సంచాలకులు డాక్టర్ శ్రీ హరినాథ్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడ్డారని గతంలో గోశాల సంరక్షణ సభ్యులుగా పనిచేసిన శ్రీ కోటి శ్రీధర్ ఆరోపించారు. మందులు, గడ్డి, ఇతర రాష్ట్రాల నుండి గోవుల కొనుగోలులో భారీగా అవకతవకలు, గోవులు ప్రసవం అయ్యాక గోవులు ఏమయ్యాయో పూర్తి స్థాయిలో లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. టిటిడి గోశాలను వివాదం చేయవద్దని ఆయన కోరారు.
#TTDNews #BRSNaidu #TTDGosala #TTDCorruption #TTDInspection #TTDUpdate #KotiSridhar #HarinathReddy #PinkDiamondCase #TTDChairman #AsianetNewsTelugu #andhrapradesh
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️